రూ.లక్ష సహాయంపై ప్రభుత్వం మరో ముందడుగు

by GSrikanth |
రూ.లక్ష సహాయంపై ప్రభుత్వం మరో ముందడుగు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకునేలా సంబంధిత వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. అర్హులైన వారు ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫోటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఈ స్కీంను సీఎం కేసీఆర్ ఈ నెల 9వ తేదీన మంచిర్యాల జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరుకు కోనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనుంది.

Advertisement

Next Story