- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ లేక బట్టలు ఆరేసుకుంటున్నారు.. ఏపీపై మంత్రి ఎర్రబెల్లి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విద్యుత్ కోతలు, భూముల ధరలను ఉద్దేశించి స్పందించారు. తెలంగాణ, ఏపీని పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కరెంట్ లేక బట్టలు ఆరేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగితే.. ఏపీలో మాత్రం భారీగా పడిపోయాయని ఆరోపించారు.
తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఏపీలో వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైందని, కరెంట్, నీటి సమస్య తీరిందని అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంతా అండగా ఉండాలని సూచించారు. దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభివృద్ది చేసింది ఏమీ లేదని, వాళ్లు చేసిన పాపాలను కడుక్కోవడానికి సరిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ అనేది లేదని, ఆ పార్టీ నేతలకు బద్ది లేదని దుయ్యబట్టారు. బీజేపీ బోగస్ పార్టీగా మారిపోయిందని, రాష్ట్రంలో ఆ పార్టీకి అవకాశం లేదన్నారు.