Damodara RajaNarasimha: మంత్రి దృష్టికి సమస్య.. వెంటనే కలెక్టర్‌‌కు ఫోన్‌

by Gantepaka Srikanth |
Damodara RajaNarasimha: మంత్రి దృష్టికి సమస్య.. వెంటనే కలెక్టర్‌‌కు ఫోన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌‌డబ్ల్యూఎస్‌(Rural Water Supply) ఇంజినీర్ల(RWS Engineers)తో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈ రఘువీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(EE) విజయ లక్ష్మి, నాగభూషణం, సంపత్, పాషా, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ప్రస్తుతం ఉన్న వాటర్ కనెక్షన్స్‌ సరిపోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.

విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అదనపు కనెక్షన్స్‌ ఇవ్వాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్‌, వాటర్ సప్లై చేయిన్‌కు సంబంధించి రిపేర్లను, ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలన్నారు. ఆర్‌‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పెండింగ్ బిల్స్‌ సమస్యను అధికారులు మంత్రి దృష్టికి రావడంతో, మంత్రి ఈ విషయంపై కలెక్టర్‌‌తో ఫోన్‌లో మాట్లాడి బిల్లులు వెంటనే విడుదల చేయాలని సూచించారు.

మిషన్ భగీరథలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను ప్రతి నెలా చెల్లించాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి సూచించారు. సంబంధిత మ్యాన్ పవర్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించాలని, రెగ్యులర్‌‌గా వేతనాలు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పరిశీలనకు వస్తానని అధికారులకు మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed