MBBSలో ప్రవేశాలపై మంత్రి దామోదర రాజనరసింహా క్లారిటీ

by Gantepaka Srikanth |
MBBSలో ప్రవేశాలపై మంత్రి దామోదర రాజనరసింహా క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంబీబీఎస్‌లో ప్రవేశాలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 విడుదల చేసిన విషయం తెలిసిందే. 9th to 12th వరకు రాష్ట్రంలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ గతంలో జీవో విడుదల చేసింది. 2017 జులై 5వ తేదీన గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని మంత్రి రాజనరసింహా తెలిపారు. జీవో 114లోని 9-12 వరకు చదివిన వారిని స్థానికులుగా పరిగణించే నిబంధన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట నాలుగేళ్లు చదివిన వారిని స్థానికులుగా పరిగణించే నిబంధన వర్తించదని అన్నారు. జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఆ నిబంధన కొనసాగించలేమని అన్నారు. కాగా, ఈ నోటిఫికేషన్‌ కింద పరిధిలోని ఎంబీబీఎస్‌, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్‌ యూజీ 2024 అర్హత పరీక్షలో అర్హత సాధించిన రాష్ట్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్ధులు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement

Next Story