ప్రాణం పోయినా సరే ఆ పార్టీతో మాత్రం కలిసి నడవం

by GSrikanth |
ప్రాణం పోయినా సరే ఆ పార్టీతో మాత్రం కలిసి నడవం
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఎమ్ఐఎమ్ పార్టీలపై చేసిన కామెంట్స్‌ను గుర్తుచేశారు. బీజేపీకి ఎమ్ఐఎమ్ బీజేపీ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పారు. తాజాగా.. ఆ కామెంట్స్‌కు క్లారిటీ ఇచ్చారు. తాము ఎవరికీ బీటీమ్ కాదని.. ప్రాణం పోయినా కానీ, బీజేపీతో కలిసి నడబోము అని తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుందని, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story