- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగులో దుమ్మురేపుతున్న నల్గొండ గద్దర్ ఎంఐఎం పాట
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు పార్టీలు తమ వ్యూహాలను మార్చివేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ గడ్డపై మరోసారి పార్టీ జెండా ఎగరవేసేందుకు ఎంఐఎం పార్టీ ప్రయత్నాలు ఆసక్తిగా మారాయి. ఈ సారి ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఉండనుందన్న అంచనాలతో సంప్రదాయ ఓటర్లతో పాటు తెలుగు మాట్లాడే ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఎంఐఎం. ఈ క్రమంలో పార్టీని, పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీని తెలుగు ఓటర్లవద్దకు చేర్చేందుకు పతంగి పార్టీ తాజాగా పాటను ఆయుధంగా ఎంచుకుంది. ఈ మేరకు ఆ పార్టీ తెలుగు పాటను రిలీజ్ చేసింది. 'భగభగ మండే నిప్పుల దండై.. ఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై..' అంటూ సాగే పాటను నిన్న విడుదల చేసింది. ఈ పాటకు నల్గొండ గద్దర్( కాసాల నర్సన్న) స్వరం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో పొలిటికల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీ పాటలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ సైతం ఇదే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇటీవలే ఓవైసీ నల్గొండ గద్దర్ తో ఓవైసీ భేటీ అయి పార్టీ పాటపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో తాజాగా పాటను రిలీజ్ చేశారు. మరి ఎంఐఎం తెలుగు పాటు కొత్త అసదుద్దీన్ కు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.
ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ తెలుగు పాట... | MIM @asadowaisi Telugu Song | Hyderabad | Nalgonda Gaddar |#AIMIMSong #AsaduddinOwaisi #NalgondaGaddar #Majlis #Hyderabad #Telangana #India pic.twitter.com/Cu7xWJDTBg
— AIMIM (@aimim_national) April 27, 2024