- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఉదయం 5.30 గంటల నుంచి సర్వీస్ ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కు మెట్రో ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలంలో ఈ మెట్రో సేవలను ప్రతి రోజు లక్షల మంది వినియోగించుకుంటున్నారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఉన్నందున రోజు రోజుకు మెట్రోను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉండగా.. తాజాగా మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఙప్తుల మేరకు ఉదయం 5.30 గంటల నుంచి మెట్రోను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం మార్నింగ్ షిఫ్టులకు జాబ్‌లకు వెళ్లే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా ఇప్పటికే ఉదయం 5.30 గంటలకు గత శుక్రవారం ప్రయోగాత్మకంగా రైళ్లు నడపగా.. మంచి స్పందన దక్కింది. దీంతో ప్రతి రోజూ అదే సమయానికి సేవలను అందించేందుకు మెట్రో సిద్ధం అయింది.