ఉచితంగా నీట్ టెస్ట్ సిరీస్..

by Vinod kumar |
ఉచితంగా నీట్ టెస్ట్ సిరీస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉచితంగా నీట్ టెస్ట్ సిరీస్ తో పాటు మెంటార్ షిప్ ను అందజేయనున్నట్లు మెటా మైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో విజయం సాధించాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా మెంటార్ షిప్ టెస్ట్ సిరీస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు మనోజ్ కుమార్ పేర్కొన్నారు. కావును బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా నీట్ టెస్ట్ సిరీస్, మెంటార్ షిప్ నకు సంబంధించిన వాల్ పోస్టర్ ను మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. వీటి కోసం ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, 8522958575 లేదా 7032264910 నంబర్లకు సంప్రదించాలని మెటామైండ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed