- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్గేతో T- కాంగ్రెస్ నేతల భేటీ.. స్టేట్ లీడర్స్‌కు AICC చీఫ్ కీలక సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: టీ –కాంగ్రెస్ నేతలు ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు కేటాయించడం, ఇండ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం, పటిష్టంగా ఎస్సీ, ఎస్టీ చట్టాలు అమలు, వర్గీకరణ అంశాలపై డిస్కషన్స్ జరిగాయి. దీంతోపాటు వివిధ పార్టీల్లోని ఎస్సీ, ఎస్టీ నేతల చేరికలపై కూడా చర్చకు వచ్చినట్లు ఓ నేత తెలిపారు. విద్య, వైద్యం, గృహనిర్మాణలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని ఖర్గే టీ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
అంతేగాక ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభను సక్సెస్ చేయడంపై కూడా ఖర్గే నేతలతో అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఈ నెల 29న వరంగల్‌లో మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్, బలరాం నాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు.