ఇంటి యజమానురాలు‌తో స్నేహం.. ఆపై 20 తులాల బంగారం జంప్

by Mahesh |
ఇంటి యజమానురాలు‌తో స్నేహం.. ఆపై 20 తులాల బంగారం జంప్
X

దిశ, కుత్బుల్లాపూర్ : తాను నివాసం ఉంటున్న ఇంటికే కన్నం వేసింది ఓ కిలాడీ. ఇంటి యజమాని రాలి తో స్నేహంగా మెసులుతూ ఆ ఇంట్లో గల నగలు, నగదు జాడను పసిగట్టి యజమానురాలి ఇంటికే కన్నం వేసి కటకటాల పాలైన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాచుపల్లి సీఐ జే. ఉపేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీ లోని సివిల్ కాంట్రాక్టర్ వెంకట్రావు ఇంట్లో బడుగు జ్యోతి అనే మహిళ గత రెండు సంవత్సరాల నుండి నివసిస్తుంది. తాను నివాసం ఉంటున్న ఇంటి యజమానురాలు తో జ్యోతి స్నేహంగా మెలిగేది. దీంతో జ్యోతికి యజమానురాలి ఇంటి విషయాలు, ఆర్థిక విషయాలతో పాటు, కుటుంబ నేపథ్యం అంతా తెలుసుకుంది. యజమానురాలికి ఎంత బంగారం ఎక్కడ ఉంది, నగదు ఎక్కడ ఇస్తారు అనే విషయాలు క్లియర్ గా తెలుసు.

పథకం ప్రకారం దోపిడీకి స్కెచ్..

ఇంటి యజమానురాలు ఇంట్లో ఉంటున్న నగలు, నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న జ్యోతికి యజమాని రాలి ఇంటికీ కన్నం వేయాలని పథకం రచించినది. నిజాం పేట్ ఇందిరమ్మ కాలనీ లో నివాసం ఉంటున్న తనకు వరసకి మరిది అయ్యే జంపని చైతన్య కుమార్ కు తన ఇంటి యజమాని రాలి ఇంట్లో ఉంటున్న బంగారం, నగదు కొట్టేయాలని తెలిపింది. దీంతో తనకు ఉన్న అప్పులు తీర్చుకోవచ్చని అందుకు సహాయం చేయాలని అందుకు చైతన్యకు కూడా వాటా ఆశ చూపి దొంగతనం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది.తరచుగా ఇంటి ఓనర్ తో తన ఇంటి తాళం రిపేర్ అయ్యింది మీ తాళం ఇవ్వండి వేసుకుంటా అంటూ పలు మార్లు యజమాని రాలి తాళం తీసుకుపోయింది. ఇలా గత కొంత కాలం నుండి తాళం తీసుకువెళ్లడం తిరిగి ఇవ్వడం చేసేది. ఈ క్రమంలో ఇంటి యజమాని రాలి తాళం చెవిని సీక్రెట్‌గా తయారు చేయించి తన దగ్గరే ఉంచుకుంది. గత నెల 26న తాను నివాసం ఉంటున్న ఇంటి యజమానిరాలు పని నిమిత్తం ఇంటికీ తాళం వేసి బయటకు వెళ్లింది.

దీంతో ఇదే అదనుగా భావించిన జ్యోతి తన మరిది జంపని చైతన్య కుమార్ ను పిలుపించుకొని అప్పటికే సీక్రెట్ గా తయారు చేయించుకున్న మరో తాళం చెవితో యజమాని రాలి ఇంటిని ఓపెన్ చేసింది.ఇంట్లో గల బీరువాలో ఉన్న 20 తులాలు నగదు, రూ. ఒక లక్షా 70 వేల నగదు ను జ్యోతి, చైతన్య కుమార్ లు కలిసి దోచుకెళ్లారు. ఎలాంటి అనుమానం రాకుండా తమ వెంట తెచ్చుకున్న మరో డూప్లికేట్ కీ తో ఇంటికి తాళం వేశారు. ఇంటి యజమానురాలు రాజ్యం వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పటికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఏదో అవసరం నిమిత్తం ఇంటి యజమానురాలు అదే రోజు మధ్యాహ్నం బీరువా ఓపెన్ చేసి చూడగా అందులో గల నగదు, బంగారం కనిపించలేదు. దీంతో వారు ఇంట్లో జరిగిన నగదు, బంగారం దోపిడీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనుమానంగా తిరుగుతున్న పై ఇద్దరు నిందితులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఇంటి యజమాని ఇంట్లో చేసిన దొంగతనం తామే చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 20 తులాల బంగారం,రూ.90 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు శనివారం వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed