- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలీవుడ్ ఇండస్ట్రీలో అదే ముఖ్యం.. నచ్చకపోయినా తప్పలేదంటూ రెజీనా కీలక వ్యాఖ్యలు..
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రెజీనా(Regina Cassandra) ఇటీవల ‘ఉత్సవం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రజెంట్ విదాముయార్చి(VidaaMuyarchi), ఫ్లాష్‌బ్యాక్, జాట్, సెక్షన్ 108 వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా బాలీవుడ్ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘‘‘దక్షిణాది నుంచి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతో మంది భాషా పరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. భాష విషయంలో స్పష్టంగా లేకపోతే.. తమ ప్రాజెక్టుల్లోకి తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. కానీ దక్షిణాదిలో అలా ఉండదు. హిందీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు ముంబైలోనే ఉండాలి మీటింగ్స్‌లో పాల్గొనాలని తెలిపారు. ఆ విషయం పెద్దగా నాకు నచ్చక పోయినప్పటికీ అదే అక్కడ ముఖ్యమని అర్థమైంది సినిమాల కోసం చేయక తప్పలేదు. సౌత్‌లో ఇలాంటి నియమనిబంధనలేమి ఉండవు.
కాస్టింగ్ ఏజెంట్లు అన్న పదానికి కూడా అక్కడ చోటులేదు. కేవలం మేనేజర్లు, పీఆర్వోలు ఉంటారు. ఇప్పుడిప్పుడే టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు సౌత్‌లోనూ ప్రవేశిస్తున్నాయి. ఇకపోతే బాలీవుడ్‌లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అలాగని నాకు త్వరగా ఆఫర్లు రావాలని మార్కెట్లో నన్ను నేను అమ్ముకోలేదు. కానీ మెండిగా ఉంటే చాన్సులు రావని తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు నాకు అక్కడ ఒక టీమ్ ఉంది. అవకాశాల విషయంలో వాళ్లు నాకు చాలా సాయం చేస్తారు. వాళ్లే నాకు సంబంధించిన వ్యక్తులతో సంప్రదింపులు చేస్తారు. నేను కేవలం ఆడిషన్స్‌లో పాల్గొంటా అంతే’’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ రెజీనా(Regina Cassandra) కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.