- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirumala : తిరుమలలో శ్రీవారికి తులాభారం ఎలా చేస్తారో తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు రకరకాల మొక్కులు చెల్లి్ంచుకుంటుంటారు. అయితే తులాభారం(Tulabharam) మొక్కు వీటిలో ప్ర్యత్యేకమైంది. దీనిని పూర్వం తులాదండం అని కూడా పిలిచేవారు. ఈ మొక్కును ఎలా తీర్చుకుంటారన్న విషయంపై చాలమందికి అవగాహన లేదు. ఈ మొక్కును తీర్చుకునేందుకు టీటీడీ దేవస్థానం ఆలయంలో తులాభారం ఏర్పాటు చేసింది. ఈ మొక్కు కింద కలకండ, బెల్లం, చక్కెర, బియ్యం, చిల్లర నాణాలను సమర్పి్ంచుకోవచ్చు. ఇందుకోసం ఆయా ద్రవ్యాలను దేవస్థానం వారు తులాభారం వద్దనే అందుబాటులో ఉంచారు.
భక్తులు చేయాల్సిందల్లా సమర్పించాల్సిన ద్రవ్యాలకు సంబంధించి సరిపడ డబ్బులను చెల్లించి వాటిని స్వామికి తులాభారం ద్వారా స్వామికి సమర్పి్ంచి మొక్కును తీర్చుకోవచ్చు. స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిన వారు, కోర్కెలు తీరిన వారు తులాభారంలో మొక్కు తీర్చుకుంటారు. తిరుమలలో ప్రతిమా మండపానికి దక్షిణ దిక్కున రంగనాయక మండపం ముందు భాగాన తులాభారం ఏర్పాటు చేశారు. త్రాసు, తక్కెడతో తులాభారం వేలాడుతూ కనిపిస్తుంటుంది.