- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్సీ కవిత
దిశ, మేడ్చల్ టౌన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ విషయంలో ఎప్పటికప్పుడు మహిళలు అప్ డేట్ అవుతూ ఉండాలని చెప్పారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.
అంతకుముందు ఎమ్మెల్సీ కవిత హోలీ సంబరాలో పాల్గొని విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తను ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అన్నారు. జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్స్ లర్ కల్పన రెడ్డి, డైరెక్టర్లు షాలిని రెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి, ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ మాధవి లత, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.