ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా తూకం వేయాలి

by Sridhar Babu |   ( Updated:2024-11-08 15:25:41.0  )
ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా తూకం వేయాలి
X

దిశ, కొడిమ్యాల : ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ధాన్యం తూకం వేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మిల్లర్లకు సూచించారు. శుక్రవారం కొడిమ్యాల మల్యాల మండల మిల్లర్లతో జేఎన్టీయూ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యంలో నుంచి ఒక్క కిలో కట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను, మిల్లర్లను హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు సహకరించాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని, ప్రభుత్వం ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ బీఎస్ లతా, ఫ్యాక్స్ చైర్మన్ రాజా నర్సింగరావు, మల్యాల ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed