- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra : మహిళా అభ్యర్థిపై వల్గర్ కామెంట్స్.. అర్వింద్ సావంత్‌కు పోల్ ప్యానెల్ వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో : మహిళలపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఖండించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలు, వ్యాఖ్యలను మానుకోవాలని ఈసీ గతంలో పొలిటికల్ పార్టీలను ఆదేశించింది. శివసేన(యూబీటీ) నేత అర్వింద్ సావంత్ ఇటీవల ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో చేరిన బీజేపీ మహిళా నేత శైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.
‘ఇంపోర్ట్‌డ్ మాల్’ వ్యాఖ్యలతో దూమారం
సావంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ తాను ‘మాల్’ కాదని ముంబై కూతురిని అని శైనా అన్నారు. తాను మహిళను అని మహా వినాష్ అఘాడీ మహిళలను గౌరవించదని అందరికి తెలుసు అని సీరియస్ అయ్యారు. అర్వింద్ సావంత్ తనను ‘ఇంపోర్ట్‌డ్ మాల్’ అని పిలిచాడని.. ఆ సందర్భంలో అమీన్ పటేల్ నవ్వుతున్నాడని మండిపడ్డారు. తన సోదరి లేదా భార్యను ఇలా అంటే ఊరుకుంటాడా అని ఆమె ప్రశ్నించారు. ఉద్దవ్ సేనను ఓ విషయం అడగాలనుకుంటున్నా..సంజయ్ రౌత్ సైతం క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు.. తాను ఇంపోర్ట్‌డ్ అన్నారని అది ఆయన మనస్తత్వాన్ని తెలుపుతోందని ఘాటుగా స్పందించారు. జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు మహిళా నాయకురాలిపై అసభ్య పదజాలాన్ని వాడారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో తల్లులు, కూతుళ్లు షాక్ లో ఉన్నారని ప్రజలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. జార్ఖండ్ సీఎం కోడలు, బీజేపీ క్యాండిడేట్ సీతా సోరెన్‌ను సైతం అవమానపర్చినందుకు కాంగ్రెస్ పార్టీపై మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.