- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ITBP Recruitment: భారీ జీతంతో ఐటీబీపీలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్(Telecommunication) విభాగంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 526 ఎస్సై(SI), హెడ్ కానిస్టేబుల్(Head Constable) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://itbpolice.nic.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 15న ప్రారంభమై డిసెంబర్ 14 వరకు కొనసాగనుంది. ఈ పోస్టులకు పురుషులతో పాటు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు, ఖాళీలు:
ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ - 526
విద్యార్హత:
పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్మీడియట్ ఉతీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
ఎస్సై పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.
జీతం:
ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది.