- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వక్ఫ్స్ బోర్డ్ బాధితుల మౌన ప్రదర్శన..
దిశ, మేడిపల్లి: బోడుప్పల్ వక్ఫ్స్ బోర్డ్ బాధితుల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్ ప్రధాన కూడలి అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు మౌన ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమంలో వందలాది సంఖ్యలో బాధిత కుటుంబాలు నల్ల రంగు మాస్కులు ధరించి చేతిలో ప్లకార్డులు మౌన ప్రదర్శన చేశారు. వక్ఫ్స్ బోర్డ్ జేఏసీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు బోడుప్పల్లో నెలకొన్న సమస్యకు పరిష్కారం చూపాలంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు, ఈ కార్యక్రమంలో కోకన్వీనర్ రమేష్ , జేఏసీ కో చైర్మన్లు, కార్పొరేటర్లు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, పోగుల నరసింహారెడ్డి, ఇతర కాలనీలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మహిళ నాయకురాలు వరలక్ష్మి మరియు వందలాది మంది మహిళలు పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం జరిగిన పత్రిక సమావేశంలో పలువురు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు, పడుకుంటే నిద్ర కూడా పట్టట్లేదని వారు వాపోయారు, క్షణక్షణం భయపడుతూ బతుకుతున్నామని మా పిల్లల భవిష్యత్తు ఏంటో ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు.