- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Election Results: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra), జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలకు గాను జరిగిన బై ఎలక్షన్ ఫలితాలు మరికొద్దిసేపట్లోనే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎం ఓట్ల (EVM Votes)ను లెక్కించనున్నన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల (Counting Centers) వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనకు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యంగా కేరళ (Kerala)లోని వాయనాడ్ (Wayanad) లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేయడంతో అక్కడ ఎలాంటి ఫలితం వెలువడబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మహారాష్ట్ర (Maharashtra)లో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికలు మహాయుతి (Mahayuthi), మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో భారతీయ జనతా పార్టీ (BJP), ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన (Shivasena), ఎన్సీపీ (NCP) ఉండగా... మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi)లో కాంగ్రెస్ (Congress), ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ (Sharad Pawar) పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా జార్ఖండ్ (Jharkhand)లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్‌ను నిర్వహించారు. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. అక్కడ ఎన్డీఏ కూటమి (NDA Alliance), జేఎంఎం కూటమి (JMM Alliance) మధ్యే టగ్ ఆఫ్ వార్ జరగనుంది.అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్, మొరాదాబాద్‌లోని కుందర్కి, ఘజియాబాద్, అలీగఢ్‌లోని ఖైర్, మెయిన్‌పురిలోని కర్హాల్, కాన్పూర్ నగరంలోని సిసామావు, ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్, అంబేద్కర్ నగర్‌లోని కతేహ్రీ, మీర్జాపూర్‌లోని మజ్వాన్ స్థానాల్లో ఓటింగ్ జరిగింది.