ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు రోడ్డు విస్తరణ చేపట్టండి.. నరేంద్ర చౌదరి

by Sumithra |
ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు రోడ్డు విస్తరణ చేపట్టండి.. నరేంద్ర చౌదరి
X

దిశ, కుత్బుల్లాపూర్ : ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకూ రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపట్టండి అని ప్రగతి నగర్ బీజేపీ శాఖ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నోసార్లు ప్రకటించారని కానీ నేడు ఆ సమస్య కొరకు ఏ మాత్రం చలనం లేకుండా వదిలేయడం విడ్డూరంగా ఉందని వాపోయారు.

ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వెళ్లే దారిలో తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు ప్రజలను వేదిస్తున్నాయని అన్నారు. ఇక్కడి నుండి రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మిస్తానని స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో హామీ ఇచ్చి మూడు సార్లు ఇక్కడి ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నెరవేర్చకుండా ప్రగతి నగర్ ట్రాఫిక్ సమస్యలు గాలికి వదిలేయడం బాధాకరం అని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీని ఎమ్మెల్యే సత్వరమే నెరవేర్చేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed