చోరీలకు పాల్పడిన ఇద్దరు రిమాండ్..

by Kalyani |
చోరీలకు పాల్పడిన ఇద్దరు రిమాండ్..
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కూకట్​పల్లి పోలీసులు మంగళవారం రిమాండ్​కు తరలించారు. కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్​ వివరాలు వెళ్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన సర్దెన శ్యాంకుమార్​(19), కరిమెండి మధు కుమార్​ అలియాస్​ మధు(20)లు చిన్న నాటి నుంచి స్నేహితులు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్​గా చేసుకుని చోరీలకు పాల్పడుతుండే వారు.

ఈ క్రమంలో కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మూడు కేసులలో నిందితులుగా ఉన్నారు. కూకట్​పల్లిలో ఇద్దరి కదలికలు గుర్తించిన బాలానగర్​ సీసీఎస్​ పోలీసులు, కూకట్​పల్లి పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసును చేధించేందుకు కృషి చేసిన సీఐ నరసింగరావు, డీఐ ఆంజనేయులు, సీసీ పోలీసులను ఏసీపీ చంద్రశేఖర్​ అభినందించారు.

Advertisement

Next Story