- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Trending: తాను తనువు చాలించి.. పది మందికి ప్రాణం పోసిన యువతి
దిశ, వెబ్‌డెస్క్: మనుషుల జీవితాలు నీటిపై రాతల్లాంటివి. ఎప్పుడు ఏం జరగుతుందో.. ఎన్నడు ప్రాణాలు పోతాయో తెలీదు. బతికినన్ని రోజులు ఎలా బ్రతికామన్నది ముఖ్యం కాదు.. ఎలాంటి పనులు చేశామనేది ప్రధానం. తాజాగా, మేడ్చల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ఘటన మానవత్వానికి మచ్చుతునకగా నిలుస్తోంది. తాను చనిపోయినా.. మరో పది మంది ప్రణాలను కాపాడి అందరి ఇళ్లలో దీపం పెట్టింది ఓ యువతి. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతుల చిన్న కుమార్తె దీపికాకు (16) ఇంట్లోనే ఫిట్స్ వచ్చింది. అయితే, గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటినా చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అన్ని పరీక్షలు చేసి దీపికను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యులు బాలిక తల్లిదండ్రులకు ఆవయవ దానం గురించి కౌన్సిలింగ్ ఇవ్వగా వారు అందుకు అంగీకరించారు. దీంతో బాలిక అవయవాలతో వైద్యులు మరో పది మందికి ప్రాణం పోశారు.