మైనంపల్లి ప్రకటన కోసం ఉత్కంఠ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

by Mahesh |   ( Updated:2023-08-26 06:38:46.0  )
మైనంపల్లి ప్రకటన కోసం ఉత్కంఠ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు
X

దిశ, పేట్‌బషీరాబాద్: "మల్కాజిగిరి గడ్డ.. హనుమంతన్న అడ్డ"... "హనుమంతన్న జిందాబాద్".. "మైనంపల్లి నాయకత్వం వర్ధిల్లాలి" నినాదాలతో ధులపల్లిలో ఉన్న ఆయన నివాస ప్రాంగణం దద్దరిల్లుతుంది. ఉదయం నుంచి ఆయన నివాసానికి భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. మైనంపల్లి నివాసం నుంచి బయటకు వచ్చి ఏ నిమిషంలో ఏం ప్రకటన చేస్తారో అంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్ఏ టికెట్ ప్రకటన నేపథ్యంలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలతో ఆయనకు పార్టీకి మధ్య దూరం పెరగడం, కాంగ్రెస్ పార్టీ ఆయనను సంప్రదించిన వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

Advertisement

Next Story