Medchal District : జిల్లా ఓటర్లు 26,91,167

by Aamani |   ( Updated:2024-02-03 13:21:15.0  )
Medchal District :  జిల్లా ఓటర్లు 26,91,167
X

దిశ,ప్రతినిధి మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 26 లక్షల 91 వేల 167 గా తేలింది. జిల్లాలో ప్రస్తుత లెక్కల ప్రకారం పురుష ఓటర్లు 13 లక్షల 95 వేల 33 గాను, మహిళా ఓటర్లు 12 లక్షల 95 వేల 773 గాను వచ్చింది. ఇతరులు 361గా నమోదు అయ్యారు. సెప్టెంబర్ 19 వరకు జాబితాలో మార్పులు చేర్పులు తో పాటుగా కొత్తవారికి ఓటు హక్కు నమోదు చేసుకున్నందుకు ఎన్నికల అధికారులు అవకాశం ఇచ్చారు. అనంతరం జరిగిన వడపోతుల ప్రక్రియ తర్వాత తాజాగా విడుదల చేసిన ఫైనల్ ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఓటర్లు ఈ విధంగా ఉన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో..

పురుషులు: 3,51,307

మహిళలు: 3,17,793

ఇతరులు: 153

మొత్తం: 6,69,253

మేడ్చల్ నియోజకవర్గంలో..

పురుషులు: 3,06,854

మహిళలు: 2,88,486

ఇతరులు: 42

మొత్తం: 5,95,382

ఉప్పల్ నియోజకవర్గంలో..

పురుషులు: 2,65,493

మహిళలు: 2,44,657

ఇతరులు: 37

మొత్తం: 5,10,187

మల్కాజ్గిరి నియోజకవర్గంలో..

పురుషులు: 2,36,804

మహిళలు: 2,32,009

ఇతరులు: 9

మొత్తం: 4,68,822

కూకట్ పల్లి నియోజకవర్గం లో..

పురుషులు: 2,34,575

మహిళలు: 2,12,828

ఇతరులు: 120

మొత్తం: 4,47,523

సర్వీస్ ఓటర్లు 729

ఇక జిల్లాలో సర్వీస్ ఓటర్లు క్రితం సారి విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రకారం 731 గా ఉండగా. ఈసారి ఆ సంఖ్య 729గా నమోదయింది. ఇద్దరు సర్వీస్ ఓటర్లను జాబితాల నుంచి అధికారులు తొలగించారు. నియోజకవర్గాల్లో ఉప్పల్ లో 158, మేడ్చల్ లో 154, కుత్బుల్లాపూర్ లో 109, కూకట్పల్లిలో 52, మల్కాజిగిరి లో 256 సర్వీస్ ఓటర్లుగా తేలారు. ఐదు నియోజకవర్గాలలో ఒక మల్కాజిగిరిలోని అత్యధికంగా సర్వీస్ ఓటర్లు ఉన్నారు.

మరో మారు టాప్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం..

జనవరి 5 2023 విడుదల చేసిన ముసాయిదా ప్రకారం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను అనుసరించి ఓటర్ల సంఖ్యలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆరు లక్షల 12 వేల 700 ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా ఆగస్టు 21న విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రకారం కూడా 6 లక్షల 39 వేల 548 ఓటర్లతో అత్యధిక ఓటర్లు నమోదు కాగా తుది జాబితాలో కూడా ఆరు లక్షల 69 వేల 253 ఓటర్లతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నది. అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గం ఐదు నియోజకవర్గాల కన్నా తక్కువ ఓటర్లతో (4,47,523) ఆఖరి స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story