వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం- నందికంటి

by Anjali |
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం- నందికంటి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు. బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుకూలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మల్కాజిగిరిలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర జరుగుతున్న తీరుతోపాటు రాబోయే రోజులలో నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా నందికంటి మాట్లాడుతూ... హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఓ వైపు ఎండగడుతూనే.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని తెలియజేయాలని సూచించారు.

ప్రతి నియోజకర్గంలో హాథ్ సే హథ్ జోడో యాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా జెడ్పీ ప్లోర్ లీడర్, టీడీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.గల్లీ స్థాయి నుండి కష్టపడితేనే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తులో కష్టపడే వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు.కేంద్రంలోని మోడీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబంపై పాల్పడుతున్న కక్ష్య సాధింపు చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర జంగయ్య యాదవ్ , మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్ లు ఎర్ర శేఖర్, చారగోని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ఏ, బి బ్లాక్ అద్యక్షులు సింగరేణి పోచయ్య,సోమశేఖర్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్ ,ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story