- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది.. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
దిశ, కుత్భుల్లాపూర్ : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరకుండా రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంటుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం ప్రగతి సాధించిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్రనాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలన 9 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్బంగా ఆదివారం మహాజనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా షాపూర్ నగర్ హెచ్ఎంటి సొసైటీలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ 8 డివిజన్ల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం ఎంతోప్రగతి సాధించిందని, ప్రతిపక్షాలు ఓర్వలేకే విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొంటుందని అన్నారు. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీఉపాధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు ఎంఎస్ వాసు, గరిగె శేఖర్, బావిగడ్డ రవి, చండి శ్రీనివాస్, పత్తిరఘుపతి, లక్ష్మిపతి రాజు, గడ్డం రాజేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, దుర్యోధన్ రావ్, కంది శ్రీరాములు, పత్తి సతీష్, ఇంచార్జులు రాజిరెడ్డి, బిల్లా, సుశాంత్, వివిధ మోర్చాల నాయకులు, డివిజన్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.