తప్పి పోయిన మూడేళ్ల చిన్నారి.. తల్లి చెంతకు చేర్చిన పోలీసులు

by Kalyani |
తప్పి పోయిన మూడేళ్ల చిన్నారి.. తల్లి చెంతకు చేర్చిన పోలీసులు
X

దిశ, కూకట్ పల్లి: ఇంటి నుంచి తప్పి పోయి రోడ్లపై ఒంటరిగా తిరుగుతున్న మూడేళ్ల చిన్నారి భాగ్యను కూకట్ పల్లి పెట్రోలింగ్​ మొబైల్​ పోలీసులు తల్లి ఒడికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కూకట్​పల్లి బాగ్​అమీర్ కాలనీలో రోడ్డుపై ఒంటరిగా తిరుగుతున్న మూడేండ్ల చిన్నారిని గమనించిన పెట్రోల్​ మొబైల్​ విధులలో ఉన్న హెడ్​ కానిస్టేబుల్​ శ్యాంరావు చిన్నారి తల్లి ఆచూకి తెలుసుకొని తల్లి దుర్గ వద్దకు చిన్నారి భాగ్యను చేర్చాడు. చిన్నారిని తల్లి వద్దకు చేర్చడంతో తల్లి దుర్గ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపింది. చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన శ్యాంరావును ఉన్నతాధికారులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story