రాజీవ్ రహదారి విస్తరణ ను తగ్గించాలి..స్థానికుల నిరసనలు..

by Aamani |
రాజీవ్ రహదారి విస్తరణ ను తగ్గించాలి..స్థానికుల నిరసనలు..
X

దిశ,కంటోన్మెంట్ : కంటోన్మెంట్ రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ విస్తీర్ణాన్ని 100 ఫీట్లు కుదించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు,దుకాణదారులు,మహిళలు స్థానిక సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ గుప్త ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 200 ఫీట్ల రహదారి విస్తీర్ణాన్ని 100 ఫీట్లకు కుదించాలని దుకాణదారులు స్థానికులు ఖార్కనలోని కె ఎఫ్ సి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్లకు 200 ఫీట్ల రహదారి విస్తీర్ణం చేస్తే తమ దుకాణాలు, ఇళ్ళను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచించాలని, హైదరాబాద్ లో ఎక్కడ కూడా 200 ఫీట్ల రోడ్డు విస్తీర్ణం లేదని, 100 ఫీట్ల విస్తీర్ణం రానున్న 25 సంవత్సరాల వరకు సరిపోతుందని వాపోయారు.ప్రభుత్వం ప్రత్యేక జి ఓ తీసుకువచ్చి రోడ్ విస్తీర్ణం తగ్గించే వరకు నిరసనలు, ధర్నాలు చేస్తామన్నారు.ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసి, వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానికుల తో పాటు బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed