ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చూడాలి : చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే

by Vinod kumar |
ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చూడాలి : చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
X

దిశ, కాప్రా: కేసుల విచారణ చేపట్టడంతో పాటు సత్వర న్యాయం అందినప్పుడే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే పేర్కొన్నారు. శనివారం కుషాయిగూడలోని 'ఆపెల్'' భవనంలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టుల సముదాయ భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరమైన న్యాయ హక్కు సాధనకై ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చూడాల్సిన అవశ్యకతను గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, టీఎస్ఐఐసి ఎం.డి ఇ. వెంకట నర్సింహా రెడ్డి, మాజీ చీఫ్ జస్టిస్ పి. నవీన్ రావు, హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్ కుమార్ తో పాటు వివిధ కోర్టుల న్యాయమూర్తులు ఆర్. రఘునాథ్ రెడ్డి, బి.అర్. మధుసూదన్ రావు, డి.ఎస్. ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమల దేవి, జోనల్ మానేజర్ మాధవి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోట రామచంద్ర రెడ్డి, రాజు యాదవ్, వివిధ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు, పోలీసు, రెవిన్యూ విభాగాల అధికార సిబ్బంది, జిల్లా కోర్టు అధికార సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story