IPL : ముంబై జట్టులోకి భారత మాజీ కోచ్..

by saikumar |
IPL : ముంబై జట్టులోకి భారత మాజీ కోచ్..
X

దిశ,స్పోర్ట్స్ : 2024 ఐపీఎల్‌ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టు.. 2025 వచ్చే సీజన్‌ కోసం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జట్టు కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేస్తూ వస్తోంది. మొన్నటివరకు హెడ్‌ కోచ్‌గా ఉన్న మార్క్‌ బౌచర్‌ను తొలగించి తిరిగి మహేల జయవర్ధనెకు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. తాజాగా టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మంబ్రేను కోచింగ్‌ బృందంలోకి తీసుకుంది. ప్రస్తుతం బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న లసిత్ మలింగతో కలిసి మంబ్రే పనిచేయనున్నాడు.

ఈ విషయాన్ని ముంబై జట్టు సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటించింది. కాగా, పరాస్ గతంలోనూ ముంబయి ఇండియన్స్ కోచింగ్ బృందంలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ సాధించగా.. అప్పుడు భారత జట్టుకు మంబ్రే బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు. అందుకే ఆయన్ను ముంబై జట్టులోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed