Amazon Prime: ఇకపై అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్

by S Gopi |
Amazon Prime: ఇకపై అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారత్‌లో సబ్‌స్క్రైబర్లు చూసే సమయంలో యాడ్స్‌ను వేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఓటీటీలో ప్రసారమయ్యే షోలు, సినిమాలు చూసే సమయంలో యాడ్స్ వచ్చే చర్యలు తీసుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అమెరికా కార్యకలాపాల్లో కంపెనీ ఈ మార్పులను అమలు చేస్తోంది. అదే తరహాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, పోటీ అధికంగా ఉన్న భారత్ లాంటి మార్కెట్లలో కంటెంట్ కోసం పెట్టుబడులు అవసరమని, నిధులు సమకూర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెజాన్ పేర్కొంది. అయితే, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, టీవీల కంటే తక్కువ యాడ్స్‌ను ప్రసారం చేయాలని, భవిష్యత్తులో కంటెంట్ పెట్టుబడులకు అవసరమైన మేర మాత్రమే ప్రకటనలను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నామని కంపెనీ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో యాడ్స్ లేని ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుందని, దానికి సంబంధించిన ధరల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed