Oxford : ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఛాన్స్‌లర్ పోటీ నుంచి ఇమ్రాన్‌ ఔట్.. రేసులో ముగ్గురు భారతీయులు

by Hajipasha |
Oxford  : ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ఛాన్స్‌లర్ పోటీ నుంచి ఇమ్రాన్‌ ఔట్.. రేసులో ముగ్గురు భారతీయులు
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని టాప్-5 యూనివర్సిటీల్లో ఇదొకటి. ఈ విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయానికి కొత్త ఛాన్స్‌లర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ శరవేగంగా ముందుకుసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక పోస్టు కోసం ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పేరుతోనూ ఒక దరఖాస్తు అందింది. అయితే ఆయన వివిధ కేసుల్లో దోషిగా తేలినందున దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

భారీ సంఖ్యలో దరఖాస్తులు రాగా, 38 మంది పేర్లను ఈ నెలాఖరులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఎన్నిక ప్రక్రియ కోసం ఖరారు చేశారు. ఈ జాబితాలో అంకుర్ శివ్ భండారి, నిర్‌పాల్ సింగ్ పాల్ భంగల్, ప్రతీక్ తర్వాది అనే ముగ్గురు భారత సంతతి వ్యక్తుల పేర్లు ఉన్నాయి.అంకుర్ శివ్ భండారికి యూకేలోని బ్రాక్ నెల్ ఫారెస్ట్ పట్టణానికి తొలి భారత సంతతి మేయర్‌గా ఎన్నికైన రాజకీయ నేపథ్యం ఉంది. ప్రతీక్ తర్వాది ఒక మెడికల్ ప్రొఫెషనల్. నిర్‌పాల్ సింగ్ పాల్ భంగల్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగం ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. ఛాన్స్‌లర్ ఎంపిక కోసం జరిగే ఎన్నికలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఓటువేయనున్నారు.

Advertisement

Next Story