- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ హైకోర్టు జడ్జీల కోసం సిఫారసులు
by Mahesh Kanagandla |
X
దిశ, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల కోసం అడ్వకేట్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసులు చేసింది. మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర దానశేఖర్, చల్లా గునరంజన్‌లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం సిఫారసులు చేసింది. సీనియారిటీ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్టోబర్ 15వ తేదీన ఓ తీర్మానంలో పేర్కొంది. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే.. కేరళ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు సీనియర్ జ్యుడీషియల్ ఆఫీసర్లను నియమించాలనీ సిఫారసులు చేసింది. మరో ప్రత్యేక తీర్మానంలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తి సిద్దయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపిక చేయాలని ప్రతిపాదించింది.
Advertisement
Next Story