- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత జర్నలిస్టుపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోండి
దిశ, దుండిగల్ : ప్రభుత్వ భూ ఆక్రమణలపై వార్త రాసిన దళిత జర్నలిస్టు మద్దయ్య పై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీసీపీ, ఏసీపీలను ఆదేశించారు. జర్నలిస్టు మద్దయ్య పై జరిగిన దాడి విషయం దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, దాడికి గురైన జర్నలిస్టు మద్దయ్య, మాలమహానాడు నేత బొట్టు నర్సింగ్ రావు కలిసి ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫోన్ లో వివరించారు.
వెంటనే స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య పేట్ బషీరాబాద్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేసి సంఘటనపై ఆరా తీశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ దుండిగల్ పొలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను, చెరువును ఆక్రమించి వెంచర్ చేస్తున్న త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థపై వార్తలు రాసిన మద్దయ్యపై దాడిచేసిన సుధాకర్ తదితరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలన్నారు.