- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గంలో చెరువు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లడుతూ కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కనుమరుగు అవుతున్న చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని చెరువులు, నాలాల పూర్తి వివరాలను రంగనాథ్‌కు అందించారు.
సత్యం మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోద్బలంతో కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు హద్దూ అదుపు లేకుండా పోయిందని, ఆ ఆక్రమణలలో భీముని కుంట, కాముని చెరువు, రంగథాముని చెరువు, సున్నం చెరువు, నల్ల చెరువు, మైసమ్మ చెరువు, ముండ్ల కత్వ చెరువు, ఖజా కుంట చెరువు, కైత్లపూర్ కుంటలు కూడా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా కూకట్‌పల్లిలో నాలాలు 150 ఫీట్ల వెడల్పు నుంచి 40 ఫీట్లకు చేరుకున్నాయని అన్నారు. బోయిన్ పల్లి డివిజన్లోని బోయిన్ చెరువు, నాలా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.
అదే విధంగా మైసమ్మ చెరువు, రంగధాముని చెరువు సుందరీకరణ పేరుతో చెరువును పూర్తిగా కబ్జా చేశారని, దీని ఫలితంగా సహజ నీటి వనరులకు ముప్పు ఏర్పడిందని అన్నరు. కూకట్‌పల్లిలోని చెరువులపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను తెలుసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు, చెరువులలో నిర్మించిన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన తెలిపారు.
- Tags
- Take action