- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మ్యాచ్ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

దిశ,ఉప్పల్ : ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న ఐపీల్ 2025 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షించారు. నేరెడ్మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సన్ రైజర్స్ టీమ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో డీసీపీ, ఏసీపీలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ ఐపీల్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ ఎంతో ప్రతి ష్టాత్మకమైనదని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అంశమని, తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టికెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్లు, ద్విచక వాహనాలకు విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలోకి ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టలు, తినుబండారాలు, వాటర్ బాటిల్స్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ కూడదని అధికారులకు ఆదేశించారు. కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్సీఏ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి డీసీపీ పద్మజ, అడ్మిన్ డీసీపీ ఇందిర, క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ నరసింహ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి, ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, హెడ్ క్వార్టర్ డీసీపీ శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు,ఏసీపీలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.