నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు

by Sridhar Babu |
నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు
X

దిశ,ఉప్పల్ : ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్టుగా తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం

ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed