జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ అమోయ్ కుమార్

by Kalyani |
జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ అమోయ్ కుమార్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: బోయిన్ పల్లి నుంచి మెదక్ జిల్లా శివారులోని కాళ్లకల్ వరకు విస్తరిస్తున్న 27 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ రహదారి విస్తరణ పనుల విషయమై జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానిక మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని బోయిన్ పల్లి కాళ్లకల్ వరకు ఆరు లైన్లతో 27 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు నాణ్యతగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు అవసరమైన చర్యలు తీసుకొని పనులు చేయించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ఏసీపీ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story