ఉప్పల్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్..

by Kalyani |
ఉప్పల్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్..
X

దిశ, ఉప్పల్: ఉప్పల్ ట్రాఫిక్ సీఐ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్డులో నెంబర్ ప్లేట్ లేకుండా సరైన పద్ధతిలో నెంబర్లు లేని వాహనాలను ద్విచక్ర, ఆటో, కార్లను తనిఖీ చేశారు. ఈ డ్రైవ్ లో బైక్, ఆటోలకు చలాన్లు విధించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని వాహనం నడిపే వారికీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ ధరించాలని, ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని సీఐ మక్బూల్ జానీ తెలిపారు. ఈ డ్రైవ్ లో ఎస్ఐ చీరంజీవి, ఏఎస్ఐ భారతి, కానిస్టేబుల్ వేణుగోపాల్, విజయ్, భాస్కర్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story