- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ వార్.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో సోషల్ వార్ నడుస్తోంది.అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ నుంచి ఇరు పక్షాల నాయకులు పోటాపోటీగా సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తూ రాజకీయ రచ్చను నడుపుతున్నారు.2009 నుండి 2014 వరకు మా నాయకుడి హయాంలో అభివృద్ధి జరిగింది.2014 నుంచి 2023 వరకూ మీ నాయకుడు హయాంలో కబ్జాలు అంటూ బీజేపీ నాయకులు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పై షోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి బదులుగా బీఆర్ఎస్ నాయకులు మా ఎమ్మెల్యే హయాంలో ఎన్నో బస్తీలు అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేత చేశాం అంటూ పోస్టులు పెడుతున్నారు.2009 నుండి 2014 వరకూ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హయాంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురయ్యాయి అంటూ బీఆర్ఎస్ నాయకులు పోస్టులు పెడుతున్నారు.2014 నుండి 2023 వరకూ ఎమ్మెల్యే అనుచరులు వందల ఎకరాలు భూ కబ్జాలు చేశారు అంటూ బదులుగా బీజేపీ నేతలు పోస్ట్ లు పెడుతున్నారు. ఇలా ప్రతి రోజు బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన షోషల్ మీడియా వారదులు ఒక వర్గం పై మరో వర్గం పోటీ పడుతూ స్థానిక వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సోషల్ మీడియా పోస్టులు స్థానికంగా పొలిటికల్ అలజడి సృష్టిస్తున్నాయి.