ప్రభుత్వ విప్ గా శంభీపూర్ రాజు..

by Kalyani |   ( Updated:2023-02-11 14:45:30.0  )
ప్రభుత్వ విప్ గా శంభీపూర్ రాజు..
X

దిశ, దుండిగల్: రాష్ట్ర ప్రభుత్వ విప్ గా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును నియమిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా శంభిపూర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గా నియమించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖమంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటానన్నారు. శాసనమండలిలో హుందాగా వ్యవహరిస్తూ మండలి గౌరవాన్ని పెంచుతానన్నారు.

Advertisement

Next Story