5.30 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి రిమాండ్

by Kalyani |
5.30 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి రిమాండ్
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో కారులో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం అదుపులో తీసుకుని రిమాండ్​కు తరలించారు. కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్​ వివరాలు వెళ్లడించారు. కూకట్ పల్లి వై జంక్షన్​లో ఎస్ఐ ప్రేమ్​సాగర్​ వాహనాల తనిఖీ నిర్వహిస్తండగా టీఎస్​08 ఎఫ్​కే 9770 గల స్విఫ్ట్​ డిజైర్​ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అనుమానస్పదంగా కనిపించడంతో కారు ఆపి తనిఖీ చేయగా కారు డిక్కీలో 5.30 కిలోల డ్రై గంజాయి ప్యాకెట్​లు లభ్యమయ్యాయి.

నిందితులు మేకల అభిలాష్​(22), మంథానికి చెందిన లింగం శ్రీపాద్​(21), అడ్డగుట్ట పల్లికి చెందిన చల్లా ధను(27), కంచుపల్లికి చెందిన నిమ్మల మణికంఠ (21) లను అదుపులో తీసుకుని రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి 5.3 కిలోల గంజాయి, స్విఫ్ట్​ కారు, 3 మొబైల్​ ఫోన్​లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement

Next Story