అద్రాస్ పల్లి సర్పంచ్ పై అధికార వేటు??

by Mahesh |
అద్రాస్ పల్లి సర్పంచ్ పై అధికార వేటు??
X

దిశ, శామీర్‌పేట: సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుండి బోయిని లలిత పలు అక్రమాలకు పాల్పడుతున్నారని మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌పల్లి గ్రామస్థులు ఇటీవలే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. అద్రాస్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరుగబోయే విచారణకు హాజరు కావాలని సర్పంచ్ బోయిని లలిత‌కు కలెక్టర్ కార్యాలయం నుండి నోటీసు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసిన పలు అంశాలపై విచారణ చేయనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

గతంలో క్రింది స్థాయి అధికారులకు సర్పంచ్ మీద ఫిర్యాదు చేసిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారు. కాగా గ్రామ ప్రజలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సర్పంచ్ విచారణకు వచ్చే సమయంలో తగిన ఆధారాలతో రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామస్థులు కూడా తగిన ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేశారు. బుధవారం విచారణలో ఎలాంటి తప్పు చేయలేదని సర్పంచ్ నిరూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులు ఇచ్చిన పిర్యాదులు నిజమని తేలితే సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

Advertisement

Next Story