- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుత్బుల్లాపూర్ లో కబ్జా రాయుళ్ల హంగామా.. అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన అధికారులపై ఎదురుదాడి
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ లో కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని తొలగించేందుకు వచ్చిన అధికారులపై ఎదురుదాడులకు దిగుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సూరారం నెహ్రూనగర్ లోని సర్వే నెంబర్ 79 లో ఓ బీఆర్ఎస్ నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టాడు. అయితే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ స్థలం కబ్జా కాకుండా కాపాడేందుకు రెవిన్యూ అధికారులు మంగళవారం వెళ్లారు.
కానీ ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన కబ్జా దారుడు స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు కావడంతో రెవిన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణం కూల్చివేసేందుకు వచ్చిన రెవిన్యూ సిబ్బందిపై, అధికారులు తీసుకువచ్చిన జేసిబీపై మూకుమ్మడి దాడి చేసి వాహనం అద్దాలు పగలగొట్టారు. దీంతో అధికారులు చేసేదేమిలేక వెనుతిరిగారు.