నాలా కబ్జాచేస్తున్న వారి పై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం : తహసిల్దార్​ గోవర్ధన్​

by Sumithra |
నాలా కబ్జాచేస్తున్న వారి పై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం : తహసిల్దార్​ గోవర్ధన్​
X

దిశ, కూకట్​పల్లి : దర్జాగా నాలా కబ్జా అన్న శీర్షికన దిశ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యు, ఇరిగేషన్​ అధికారులు స్పిందించారు. కూకట్​పల్లి మండలం కైత్లాపూర్​ గ్రామంలోని డంపింగ్​ యార్డు పక్కనుంచి వెళుతున్న ముళ్లకత్వ చెరువు నాలాను కొంత మంది మట్టితో నింపి చదునుచేస్తున్న విషయాన్ని దిశ వెలుగులోకి తీసుకు వచ్చింది. కూకట్​పల్లి ఇరిగేషన్​ ఏఈ లక్ష్మీనారాయణ, మండల రెవెన్యు ఇన్స్​పెక్టర్​ శ్రీనివాస్​ రెడ్డిలు శుక్రవారం నాలా కబ్జా జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ముళ్లకత్వ నుంచి కాముని చెరువుకు వెళుతున్న నాలా 13 మీటర్లు ఉండాల్సి ఉండగా గతంలోనే నాలా కుచించుకుపోయి 9 మీటర్లకు చేరింది. తాజాగా 9 మీటర్లు ఉన్న నాలాను ప్రసాద్​ రాజ్​ సంస్థ వారు మరో 3 మీటర్లు మట్టి నింపడంతో నాలా 6 మీటర్లకు కుచించుకు పోయిందని ఇరిగేషన్​ ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు. నాలాలో మట్టి పోసి నింపిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని లక్ష్మీనారాయణ తెలిపారు.

చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం.. కూకట్​పల్లి తహసిల్దార్​ గోవర్ధన్​ ..

నాలాలో మట్టి పోసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దారు అన్నారు. ఆర్​ఐని పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. నివేదిక సిద్ధం చేసి నాలా కబ్జాకు పాల్పడిన వారిపై కేసునమోదు చేస్తాం.

Advertisement

Next Story