- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిషేధిత డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న నిందితుల రిమాండ్..
దిశ, కూకట్పల్లి: నిషేధిత డ్రగ్స్ ఎండీఎంఏ, గంజాయి విక్రయిస్తున్న నిందితులను కూకట్పల్లి పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 1.7 కిలోల గంజాయి, 2.20 లక్షల విలువ చేసే 29 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, సీఐ సురేందర్ గౌడ్లు వివరాలు వెళ్లడించారు. కూకట్‌పల్లిలో బెంగుళూరు నుంచి డ్రగ్స్‌ను దిగుమతి చేసి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
కూకట్పల్లి వై జంక్షన్లో అనుమానస్పదంగా కనిపించిన బెంగళూరుకు చెందిన యూసఫ్ షరీఫ్(27), షబాజ్ ఖాన్(21)లు ఇద్దరు అన్నదమ్ముళ్లను అదుపులో తీసుకుని విచారించగా బెంగుళురు నుంచి డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు నేరం అంగీకరించారు. బెంగుళూరులో ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ బాయ్స్ గా పని చేస్తున్న ఇద్దరు సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ స్మగ్లర్లుగా అవతారమెత్తారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించినట్టు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.
అదే విధంగా వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 1.7 కేజీల గంజాయి, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూసాపేట్ జనతానగర్‌కు చెందిన దుప్పల నరేష్(22), వైజాగ్‌కు చెందిన బాలాజీలు వైజాగ్ నుంచి గంజాయిని తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు, కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి నిర్వహించారు. గంజాయి సరఫరా చేస్తున్న దుప్పాల నరేష్‌ను అదుపులో తీసుకోగా బాలాజీ అనే మరో నిందితుగడు పరారీలో ఉన్నట్టు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. కేసును చేధించిన బాలానగర్ ఎస్ఓటీ సిఐ రాహుల్ దేవ్, కూకట్పల్లి డీఐ ఆంజనేయులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.