రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా చూడాలి

by Sridhar Babu |
రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా చూడాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : వర్షానికి రోడ్ల పై నీరు నిలువకుండా నాలాలు పూడికలు తీయడమే కాకుండా నీరు వెళ్లే మార్గాలను క్లియర్ చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ గౌతం సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్ లో జరిగిన జిల్లా రహదారి భద్రత సమావేశంలో అదనపపు జిల్లా కలెక్టర్​ రాధికా గుప్తాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లు, ట్రాఫిక్, మున్సిపాలిటీ, ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని రోడ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చిన్నపాటి వర్షానికి రోడ్ల పై నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి వాటి నివారణకు సరైన ప్రణాళిక రూపొందించి తద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 19 యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని ట్రాఫిక్ ఏసీపీ తెలుపగా, వాటికి తీసుకోవలసిన చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ సంవత్సరం జరిగిన ప్రమాదాలు, మరణాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు కారణలైన అధిక స్పీడు, ఇరుకైనరోడ్లు, ట్రాఫిక్ జామ్ వంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అవసరమైన చోట కల్వర్టులను ఏర్పాటు చేయాలని, రోడ్డు పక్కన ఉన్న నాలాలను క్లీయర్ చేసి వర్షం నీరు ఆగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

రహదారుల వెంట వీధి దీపాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. అధిక నిధులు అవసరమైన పనులకు ప్రణాళికలు తయారు చేసి నివేదికలు పంపాలని కలెక్టర్​ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనులు చేపట్టాలని కోరారు. జిల్లా రహదారి భద్రతా అనే అంశం పై పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి క్యాంపెయిన్లు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ మల్కాజిగిరి ఏసీపీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ రాచకొండ ఇన్స్పెక్టర్ ప్రదీప్ బాబు, ఎన్ హెచ్ 44 పీడీ ఎల్.ఎస్. రావు, ఆర్ అంఢ్ బీ డీఈఈ సరిత, ఏఈఈ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed