గ్రూప్- 1 పరీక్ష ప్రశాంతం.. పరీక్షకు 5779 మంది గైర్హాజరు..

by Sumithra |
గ్రూప్- 1 పరీక్ష ప్రశాంతం.. పరీక్షకు 5779 మంది గైర్హాజరు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : తీవ్ర ఉత్కంఠ మధ్య నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 27 పరీక్ష కేంద్రాలను మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్ష 17,779 మంది అభ్యర్థులు రాయాల్సి ఉండగా, 12,000 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగితా 5779 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఒంటి గంటన్నరకు గేట్లు మూసివేశారు. కొన్ని చోట్ల ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులకు అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అధికారులు విధించిన నిబంధనలు పాటించాలని పరీక్షా కేంద్రాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు. ఇందుకోసం అన్ని పరీక్షా కేంద్రాల్లో కెమెరాలను అమర్చారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను కూడా మూసివేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా పరీక్ష నిర్వహించవద్దని చేస్తున్న ఆందోళనల వల్ల ప్రతి కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహించిన ఇన్విజిలేటర్లు, ఇతర అధికారుల ఫోన్లను సైతం పరీక్ష హాల్ లోకి అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను సజావుగా నిర్వహించారు.

అధికారుల పరిశీలిన..

గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డీలు సందర్శించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డీతో కలిసి రాచకొండ సీపీ సుధీర్ బాబు ఉప్పల్ లోని స్పూర్తి మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత వాగ్దేవి డిగ్రీ కాలేజ్, మేఘా మహిళా డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా కూకట్ పల్లి, బాచుపల్లి, దూలపల్లిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాలను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు రాధికా గుప్తా అల్ ది బెస్ట్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed