- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Quthbullapur: ష్.. గప్‌చుప్..! గుట్టుగా ఫంక్షన్ హాళ్ల టెండర్లు
దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫంక్షన్ హాళ్ల టెండర్లు అవినీతి, అక్రమ మార్గాలకు పరాకాష్టగా మారాయి. పూర్వ గ్రామ పంచాయతీ హయాంలో నుంచి నామమాత్రపు ఫీజులను మాత్రమే కార్పొరేషన్‌కు చెల్లిస్తూ కొందరు పెత్తందారులు నిజాంపేట్ కార్పొరేషన్‌లోని ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట్ గ్రామాల ఫంక్షన్ హాళ్లను తమ గుప్పిట్లో పెట్టుకు నిర్వహిస్తూ వస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక ఆ ఫంక్షన్ హాళ్ల అద్దెలపై పలుమార్లు ఆందోళనలు, అభ్యంతరాలు కొనసాగాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్న కొందరు బినామీ వ్యక్తులను నిర్వాహకులుగా పెట్టి ఫంక్షన్ హాళ్లను తమ గుప్పిట్లో పెట్టుకుని అందిన కాడికి దోచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫంక్షన్ హాళ్లకు ఓపెన్ టెండర్లు నిర్వహించాలనే డిమాండ్ స్థానికంగా ఎప్పటి నుంచో ఉంది.
ఃనిజాంపేట్ కార్పొరేషన్ కాలం జనవరి, 2025 నాటికీ పూర్తి అవుతుండటం, జీహెచ్ఎంసీలో నిజాంపేట్ కార్పొరేషన్‌ను కూడా కలపనున్న తరుణంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. పేరుకు మాత్రమే ఓపెన్ టెండర్లుగా చెబుతూనే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు బినామీల రూపంలో కేటాయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి పేపర్ ప్రకటన లేకుండా.. పౌరులకు కనీస సమాచారం ఇవ్వకుండా, పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా గుట్టుగా టెండర్లు నిర్వహించడం అధికారులపై పలు అనుమానాలకు తావిస్తోంది. నిజాంపేట్‌లోని బండారి లేఅవుట్ కాలనీలో ఉన్న ఫంక్షన్ హాల్, ప్రగతినగర్‌లో రెండు ఫంక్షన్ హాళ్లు, బాచుపల్లిలో మరో ఫంక్షన్ హాల్ మూడేళ్ల పాటు నడిపేందుకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు.
నిబంధనల ప్రకారం.. టెండర్లు పేపర్ ప్రకటన ఇస్తూ, పబ్లిక్ డొమైన్ ఆన్‌లైన్‌లో పెట్టాలి. కానీ నిజాంపేట్ మున్సిపల్ అధికారులు అలా కాకుండా నామమాత్రంగా టెండర్ ప్రక్రియ పేరుకు మాత్రమే నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా తంతను జరిపించారు. అధికారుల తీరుపై తీవ్రంగా విమర్శలు రావడంతో టెండర్లకు 27 జూలై డెడ్‌లైన్‌గా ఉండగా ఆగస్టు 5 వరకు సమయాన్ని పొడిగించారు. ఈ నెల 5న సాయంత్రం 4 గంటల వరకూ టెండర్ ప్రక్రియ స్వీకరణ ఉన్నప్పటికీ 4లోపే మున్సిపల్ కార్యాలయంకు వచ్చిన దరఖాస్తుదారుల అప్లికేషన్లు తీసుకోకుండా తిరస్కరించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికేలా టెండర్లు గోప్యంగా నిర్వహించడం చట్టవిరుద్ధమని వాపోయారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని నిజాంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట పలువురు నిరసన తెలిపారు.