వ్యభిచారం నిర్వహిస్తున్న ‘బ్యూటిఫుల్​స్టే’ పై పోలీసుల దాడి..

by Kalyani |
వ్యభిచారం నిర్వహిస్తున్న ‘బ్యూటిఫుల్​స్టే’ పై పోలీసుల దాడి..
X

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ బ్యూటిఫుల్​స్టే పేరుతో కొనసాగుతున్న ఓయో లాడ్జిపై కేపీహెచ్​బీ పోలీసులు, బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడి చేసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వ్యభిచార గృహంలో 8 మంది మహిళలను రక్షించి రెస్య్కూ హోంకు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 10 వేల నగదు, ఐదు సెల్​ఫోన్ లు, 130 కండోమ్​ ప్యాకెట్​ లను స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కిషన్​ కుమార్​ వివరాలు వెళ్లడించారు.

కేపీహెచ్​బీకాలనీ సర్దార్​ పటేల్​నగర్​ కాలనీలో బ్యూటిఫుల్​ స్టే ఓయో రూంలలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కేపీహెచ్​బీ పోలీసులు, బాలానగర్​ ఎస్ఓటీ పోలీసులతో కలిసి దాడి చేయడం జరిగిందని తెలిపారు. అందులో ఐదుగురు నిర్వాహకులలో అనితా హల్దార్​ అలియాస్​ సుజన్​ మోండల్​ (26), మిలన్​ షీ(22), జ్యోతి మోండల్​(20)లను పోలీసులు అదుపులో తీసుకోగా రాజ్​ మోండల్​, బిల్లు అలియాస్​ మామ ఇద్దరు పరారీ లో ఉన్నట్లు సీఐ తెలిపారు. వ్యభిచార గృహం నుంచి బెంగాల్​కు చెందిన 8 మంది మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించినట్టు సీఐ వివరించారు.

Advertisement

Next Story