- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా కాలనీకి రోడ్డు లేదు సార్ ..
దిశ, అల్వాల్: మచ్చ బొల్లారం డివిజన్ లోని పలు కాలనీలు అస్తవ్యస్తం. రోడ్లు లేవు, డ్రైనేజీ సదుపాయం అసలే లేదు. ఉంటే ఒక వేల అవి రోడ్డు మీదే పారుతూ దర్శనం ఇస్తాయి.వెంకన్న కాలనీ, లక్ష్మీ ఎన్ క్లేవ్, రాయల్ కాలనీ తదితర కాలనీలలో కనీస వసతులు కరువైనట్లు కాలనీవాసులు ఆవేధన వ్యక్తం చేశారు. వెంకన్న కాలనీ, లక్ష్మీ ఎన్ క్లేవ్ కాలనీలలో నేటికి మట్టి రోడ్డే. ఇక్కడ సీసీ రోడ్ కానీ బీటీ రోడ్డు కానీ వేసే నాథుడే లేడంటున్నారు.
ఇక్కడ కార్పొరేటర్ ఉంటాడు కానీ ఎన్నికలప్పుడుతప్ప, మిగిలిన ఏ టైం లో ఇటు వచ్చిన పాపాన పోడు, మనిషే రాడు ఇక రోడ్ల వేయమని ఏమడుగుతాం అంటున్నారు కాలనీవాసులు. లక్ష్మీ ఎన్ క్లేవ్ లో వర్షపు నీరు డ్రైనేజీ నీరు కలిపి ఇంటి ముందు రోడ్డు మీద పారుతూ పోవడంతో బయటకు వెళ్లాలంటే డ్రైనేజీ నీటి నుండి పోవలసి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీలను సందర్శించి రోడ్లపై పారుతున్న డ్రైనేజీ నీరును అరికట్టి పటిష్టమైన రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ కాలనీ వాసులు కోరుతున్నారు.